Breaking News

లారీతో వదిన కాళ్లు తొక్కించి.. మరిది ఘాతుకం.. గుంటూరులో దారుణం


బుద్ధిగా కాపురం చేసుకోమని చెప్పేందుకు వచ్చిన వదినని మరిది లారీతో తొక్కించిన అమానష ఘటన జిల్లాలో జరిగింది. కాళ్లు నుజ్జునుజ్జు కావడంతో అక్కడే కదలకుండా పడిపోయిన ఆమె బాధ వర్ణనాతీతం. స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. గుంటూరులోని కొరిటెపాడు ఏరియాకి చెందిన వీరేంద్రకి మేరీతో వివాహమైంది. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండడంతో ఆమె అక్క మీరాబి సర్దిచెప్పేందుకు ప్రయత్నించింది. టిప్పర్ లారీలో గ్రావెల్ తోలుతున్న వీరేంద్ర మేడికొండూరు మండలం డోకిపర్రులో ఉన్నాడని తెలుసుకుని తన చెల్లెలిని తీసుకుని నేరుగా అక్కడికే బయల్దేరింది. ఆటోలో వెళ్తుండగా వీరేంద్ర లారీతో ఎదురుపడడంతో వదిన మీరాబి అతన్ని నిలువరించేందుకు ప్రయత్నించింది. Also Read: అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న వీరేంద్ర విచక్షణ కోల్పోయి ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య అక్కపైకి లారీని పోనిచ్చాడు. అత్యంత కర్కశంగా లారీతో ఆమె కాళ్లు తొక్కించి అక్కడి నుంచి పరారయ్యాడు. కాళ్లు రెండూ నుజ్జునుజ్జు కావడంతో సంఘటన స్థలంలో ఆమె భాధ వర్ణనాతీతంగా ఉంది. కాళ్లు కోల్పోయిన మీరాబి రోదనలు స్థానికులను తీవ్రంగా కలిచవేశాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో స్పాట్‌కి చేరుకున్నారు. తీవ్రగాయాలతో తల్లడిల్లిపోతున్న మీరాబిని గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. Read Also:


By September 10, 2020 at 10:12AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-wifes-sister-in-guntur-district/articleshow/78031625.cms

No comments