Breaking News

గుంటూరులో చీటర్.. పెళ్లి కాలేదని వితంతువుతో వివాహం.. ఆరా తీస్తే షాకింగ్


పెళ్లి కాలేదని నమ్మించి భర్త చనిపోయిన మహిళకు దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి వితంతువును వివాహమాడాడు. కొద్దికాలానికే మోసగాడిపై అనుమానం వచ్చి ఆమె ఆరా తీయడంతో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అతనికి అప్పటికే పెళ్లైందని తెలియడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని నరసరావుపేటకు చెందిన ఎస్.‌స్రవంతి పట్టణంలోని బరంపేటలో నివాసముంటోంది. ఆమె భర్త శివకుమార్ ఐదేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అనంతరం ఆమెకు దాసరి జనార్దన్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్లైన జనార్దన్ తనకు పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. మోసం చేసి స్రవంతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. Also Read: భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య ఆరా తీయడంతో విస్తుపోయే విషయాలు తెలిసి షాక్‌కి గురైంది. జనార్ధన్‌కి గతంలోనే పెళ్లైందని తెలియడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. Read Also:


By September 12, 2020 at 10:13AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-cheats-woman-on-pretext-of-marriage-in-guntur/articleshow/78071614.cms

No comments