Breaking News

సోషల్ మీడియాలో ఆంటీతో పరిచయం.. అతని ప్రాణాలు తీసింది!


సోషల్ మీడియాలో ఆంటీతో ఏర్పడిన పరిచయం యువకుడి హత్యకు దారితీసింది. ఇద్దరూ చాటింగ్ చేసుకోవడం.. ఫోన్‌లో మాట్లాడుకోవడం ఆమె భర్త కంటపడడంతో దారుణం చోటుచేసుకుంది. తన భార్య మరొకరితో క్లోజ్‌గా ఉండడం భరించలేకపోయిన భర్త ఫ్రెండ్‌ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడితో కలసి కిరాతకంగా చంపేశాడు. ఈ అమానుష ఘటన పూణెలో చోటుచేసుకుంది. నగరంలోని సంజయ్ నగర్‌కి చెందిన సౌరభ్ జాదవ్ ఓ మొబైల్ యాక్సెసరీస్ కంపెనీలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన పెళ్లైన మహిళతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ చాటింగ్ చేసుకోవడంతోపాటు అప్పడప్పుడూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఆ విషయం ఆమె భర్త అజయ్ షేక్‌కి తెలిసిపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. తన భార్య మరొకరితో క్లోజ్‌గా ఉంటోందని తెలిసి దారుణానికి తెగబడ్డాడు. Also Read: పెళ్లికి ముందు నుంచే ఇద్దరి మధ్య సంబంధం ఉందన్న అనుమానంతో భార్య సోషల్ మీడియా ఫ్రెండ్‌ని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడు సోన్యా బారతీతో కలసి హత్యకు పథకం రచించాడు. ఓ రోజు సౌరభ్‌కి ఫోన్ చేసి అవుంద్ ప్రాంతానికి రమ్మని పిలిచారు. అవుంద్ ఆస్పత్రి ప్రాంతంలో సౌరభ్‌ని కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. మెడ, చేతులు, తలపై కిరాతకంగా నిరికి హత్య చేశారు. మృతుడు సౌరభ్ సోదరుడు సుశాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Read Also:


By September 16, 2020 at 12:03PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/husband-his-friend-brutally-kills-wifes-social-media-buddy-in-pune/articleshow/78142265.cms

No comments