Breaking News

కర్నూలు: అత్తపైనే అల్లుడి కామవాంఛ.. అవమానం తట్టుకోలేక ఆత్మహత్య


పిల్లనిచ్చిన అత్త అంటే తల్లితో సమానం అంటారు. అలాంటి ఆమెను కామదృష్టితో చూసిన ఓ వ్యక్తి కోరిక తీర్చాలంటూ వేధించి అత్యాచారానికి యత్నించాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయిన ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లా తుగ్గలి మండలం యల్లమ్మగుట్ట తండాలో సోమవారం జరిగింది. Also Read: తండాకు చెందిన లక్ష్మీబాయి, కృష్ణానాయక్‌ దంపతుల కుమార్తె కవితా బాయిని అదే తండాకే చెందిన బంధువు దేవేంద్ర నాయక్‌కు ఇచ్చి రెండేళ్ల కిందట వివాహం చేశారు. ఆగస్టు 29న లక్ష్మీబాయి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అల్లుడు దేవేంద్ర నాయక్‌ వచ్చి నీళ్లు అడిగాడు. ఆమె కిచెన్‌లోకి వెళ్తుండగా వెనకాలే వెళ్లి చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. కోరిక తీర్చాలని పట్టుబడుతూ అత్యాచారానికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. Also Read: కాసేపటి తర్వాత ఇంటికొచ్చిన భర్త కృష్ణానాయక్‌ దిగాలుగా కూర్చున్న లక్ష్మీబాయిని ఏం జరిగిందని అడగ్గా జరిగిన విషయం చెప్పి బోరుమంది. అయితే ఈ విషయం బయటికి పొక్కితే తన పరువు పోతుందన్న మనస్తాపంతో ఆదివారం రాత్రి బాత్‌రూమ్‌లో లక్ష్మీబాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియగానే ఆమె కూతురు, అల్లుడు విషం తాగడంతో స్థానికులు వారిద్దరిని డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త కృష్ణానాయక్‌ ఫిర్యాదు మేరకు జొన్నగిరి పోలీసలు అల్లుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By September 01, 2020 at 07:31AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-try-to-rape-on-mother-in-law-in-kurnool-district-she-commits-suicide/articleshow/77862734.cms

No comments