Breaking News

మూడేళ్లలో 58 చోరీలు.. విశాఖలో చిక్కిన ఘరానా దొంగ, కిలో బంగారం స్వాధీనం


అతడో ఘరానా దొంగ. తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు రాత్రికి అన్నీ సర్దేస్తాడు. స్క్రూ డ్రైవర్‌, కటింగ్‌ ప్లేయర్‌, గునపం వంటి సాధారణ వస్తువులతోనే తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతుంటాడు. ఇలా మూడేళ్లలో 58 దొంగతనాలకు పాల్పడి పోలీసులనే ముప్పతిప్పలు పెట్టాడు. చివరికి సీసీటీవీ కెమెరా కంటపడి పోలీసులకు చిక్కాడు. అతడికి సహకరించిన మరో ఇద్దరిని కూడా విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా మంగళవారం మీడియాకు వివరించారు. Also Read: విశాఖ నగరం మధురవాడ దరిలోని ఓ చర్చి పాస్టర్‌ ఇంట్లో ఆగస్టు 16న 40 తులాల బంగారం చోరీ అయినట్లు ఫిర్యాదు అందింది. ఇంట్లోని సీసీ ఫుటేజీలో నమోదైన చిత్రాలు, వేలిముద్రలను సేకరించి దర్యాప్తు చేపట్టగా నిందితుడు అనేక దొంగతనాలతో సంబంధమున్న జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్‌గా గుర్తించారు. చిత్తూరు జిల్లాకు చెందిన అతడి కుటుంబం చాలా ఏళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చి స్థిరపడింది. చిన్నతనం నుంచే నేరాలకు అలవాటుపడిన ప్రభాకర్‌ గతంలో అనేకసార్లు జైలుశిక్ష అనుభవించాడు. 2017లో గన్నవరం సబ్‌జైలు నుంచి విడుదలయ్యాక విశాఖ వచ్చాడు. అతడికి మద్దిలపాలెంలో ఉంటున్న విజయనగరం జిల్లాకు చెందిన కె.తవిటిబాబు, నర్సీపట్నానికి చెందిన నవీన్‌తో పరిచయం ఏర్పడింది. Also Read: నవీన్‌, ప్రభాకర్ కలిసి రెండు దొంగతనాలకు పాల్పడ్డారు. ప్రభాకర్ దొంగిలించిన వస్తువులను తవిటిబాబు గుట్టుగా అమ్మిపెట్టి కమిషన్ తీసుకునేవాడు. ప్రభాకర్‌ ఇలా విశాఖ నగర పరిధిలో 2017లో 4, 2018లో 10, 2019లో 6, 2020లో 15 చొప్పున మొత్తం 35 చోరీలకు పాల్పడ్డాడు. వీటిలో 28సార్లు ఇళ్లల్లోనే దొంగతనాలు చేశాడు. దీంతో పాటు విశాఖ రూరల్‌లో 18, విజయనగరంలో 4, పశ్చిమ గోదావరి, ఇతర ప్రాంతాల్లో కలిపి 58 చోరీలకు పాల్పడ్డాడు. ఇలా మొత్తం 111 తులాల బంగారం, 2 కిలోల వెండి ఆభరణాలు, రూ.5 లక్షల నగదు అపహరించాడు. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 108 తులాల బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.1.69 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. Also Read:


By September 09, 2020 at 07:17AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/thieves-arrested-in-vizag-city-1-11-kg-gold-recovered/articleshow/78007975.cms

No comments