Breaking News

Lady: సోలో పెర్ఫార్మన్స్‌ మోనో ప్లే.. రీల్ స్టార్ రియల్ స్టోరీ ఇది.. మాధవీలత డేర్ స్టెప్!!


యంగ్ పోటీషియన్, హీరోయిన్ సోలో పెర్ఫార్మన్స్ చేయడానికి రెడీ అయింది. సరికొత్తగా సోలో పెర్ఫార్మన్స్‌లో మోనో ప్లే మెథడ్ ఉపయోగించి రూపొందనున్న కొత్త సినిమాలో మాధవీలత నటించనుంది. జీఎస్‌ఎస్ఎస్‌పి కళ్యాణ్ డైరెక్షన్‌లో ఓ రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా తెరకెక్కనుంది. దాని పేరే ''. ఇందులో మాధవీలత సోలోగా సత్తా చాటనుండటం విశేషం. ఈ మోనో ప్లే ఎక్స్ర్‌పరిమెంటల్ మూవీని చరణ్స్ క్రియేషన్స్, జీఎస్ఎస్ఎస్‌పీకే స్టూడియోజ్ బ్యానర్లపై సత్యనారాయణ గొరిపర్తి, జీఎస్ఎస్ఎస్‌పి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. కేవలం ఒకే ఒక క్యారెక్టర్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా దర్శకుడు కళ్యాణ్ తెలిపారు. ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీతో రెడీ చేస్తున్న ఈ సినిమా ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని అన్నారు. Also Read: ఇక ఈ సినిమాకి హీరోయిన్ మాధవీలత నటన ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని, సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నట్లుగా చిత్రం బృందం తెలిపింది. త్వరలోనే చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత సత్యనారాయణ చెప్పారు. ఈ ప్రకటనతో చిత్రంలో ఏం చూపించబోతున్నారు? సోలో మూవీ ఎలా ఉండనుందనే ఆసక్తి నెలకొంది జనాల్లో.


By August 16, 2020 at 01:10PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/young-heroine-maadhavi-latha-new-movie-lady-announced/articleshow/77571714.cms

No comments