Breaking News

అన్నే కామాంధుడై.. బాలికపై బాత్రూమ్‌లో అత్యాచారం.. గుంటూరులో దారుణం


జిల్లాలో దారుణం జరిగింది. వరుసకు చెల్లెలు అయ్యే బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ బాలిక (11)కు అదే గ్రామానికి చెందిన చిలకా షడ్రక్‌ (23) అన్న వరుస అవుతాడు. ఎప్పటి నుంచే కన్నేసిన షడ్రక్ ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. శుక్రవారం తల్లిదండ్రులు కూలిపనికి వెళ్లడంతో బాలిక ఒంటరిగా ఉంది. Also Read: ఈ విషయం తెలుసుకున్న ఆ కామాంధుడు సాయంత్రం వేళ ఆమె ఇంటికి వెళ్లాడు. అన్నయ్యే కదా అని బాలిక అతడిని లోపలికి రానిచ్చింది. కాసేపు సరదాగా కబుర్లు చెప్పిన షడ్రక్ ఆ తర్వాత బాలికను బాత్రూమ్‌లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి కామాంధుడు పరారయ్యాడు. Also Read: కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురు ఏడుస్తూ ఉండటాన్ని గమనించారు. ఏం జరిగిందని ఆరా తీయగా షడ్రక్ చేసిన అఘాయిత్యం గురించి బాలిక వివరించింది. దీంతో వారు వెంటనే అచ్చంపేట ఎస్ఐ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగిన ఎస్ఐ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సత్తెనపల్లి డీఎస్పీ ఆర్‌.విజయభాస్కర్‌రెడ్డి, సత్తెనపల్లి గ్రామీణ సీఐ నరసింహారావులు గ్రామంలో పర్యటించి ఘటన తాలూకు వివరాలు సేకరించారు. Also Read:


By August 24, 2020 at 07:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/minor-girl-raped-by-cousin-brother-in-guntur-distirct/articleshow/77711988.cms

No comments