మేడ్చల్: ఎదురు చెప్పిందని భార్యను హత్య చేసి భర్త పరార్

నగర శివారు మల్కాజ్‌గిరి జిల్లా దుండిగల్ పరిధిలో దారుణం జరిగింది. భార్యను కిరాతకంగా చంపేసి ఓ వ్యక్తి పరారయ్యాడు. మహారాష్ట్రకు చెందిన మాధవ్, కాశీబాయి(21)కి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఉపాధి కోసమని కొంతకాలం క్రితం వీరిద్దరు హైదరాబాద్‌కు వచ్చారు. దుండిగల్ పరిధిలోని సూరారం పాండు బస్తీలో నివాసముంటున్నారు. వీరింటికి సమీపంలోనే కాశీబాయి తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. Also Read: అయితే మాధవ్, కాశీబాయి మధ్య కొద్దిరోజులు మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో దంపతులు తరుచూ గొడవలు పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లిన మాధవ్ ఆదివారమే ఇంటికి తిరిగొచ్చాడు. ఈ క్రమంలోనే భార్యతో మరోసారి గొడవ జరగడంతో ఆమెను చంపేసి పరారయ్యాడు. ఆదివారం సాయంత్రం సమయంలో కాశీబాయి తల్లి కులుబాయి వారింటికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించింది. దీంతో ఆమె స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. Also Read: పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాశీబాయిని కత్తితో పొడిచి చంపినట్లు నిర్ధారించిన పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కులుబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మాధవ్ కోసం గాలిస్తున్నారు. Also Read:
By August 24, 2020 at 07:54AM
No comments