దగ్గుబాటి అభిరామ్ కారు ప్రమాదం.. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు

ప్రముఖ హీరో రానా తమ్ముడు కారు ప్రమాదానికి గురయ్యారు. దగ్గుబాటి అభిరామ్ నడుపుతున్న బీఎండబ్ల్యూ కారు, బ్రీజా కారు ఢీకొన్నాయి. ఈ ఘటన హైదరాబాద్ మణికొండలో జరిగింది. ఓ వ్యక్తి టెస్ట్ డ్రైవింగ్ చేస్తుండగా బ్రీజా కారు, దగ్గుబాటి అభిరామ్ బీఎండబ్ల్యూ కారు మణికొండలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు కార్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు. రాయదుర్గం పోలీసులు తెలిపిన సమాచారం మేరకు... కరీంనగర్ జిల్లా ఆరేపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి మెకానిక్ లక్ష్మణ్ ద్వారా బ్రీజా కారు కొనేందుకు నగరానికి వచ్చాడు. అయితే మణికొండలో యజమాని నుంచి టెస్ట్ డ్రైవ్ కోసం కారు తీసుకొని స్నేహితుడు సతీష్ కలిసి డ్రైవ్‌కు వెళ్లాడు. పంచవటి కాలనీలో మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ వద్ద పక్క రోడ్డులోంచి వచ్చినా బీఎండబ్ల్యూ కారు, బ్రీజా కారు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. దీంతో రాజుతో పాటు దగ్గుబాటి అభిరామ్‌లు బుధవారం సాయంత్రం రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బ్రీజా కారు ఎక్కువగా డ్యామేజీ అయ్యిందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. Read More: కారు నడిపిన ఇద్దరికీ బ్రీత్ ఎనలైజర్ టెస్టు కూడా చేశారు. అయితే ఇద్దరిలో ఎవరూ మద్యం మత్తులో లేరని తేలిందన్నారు పోలీసులు. సీసీ కెమెరాలను పరిశీలిస్తేనే తప్పు ఎవరిదనే విషయం తెలుస్తుందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు. ఇటీవలే ఈనెల 8న రామానాయుడి స్టూడియోలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కరోనా నెలకొన్న నేపథ్యంలో అతితక్కువ మంది అతిథులతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించింది దగ్గుబాటి ఫ్యామిలీ.
By August 13, 2020 at 09:19AM
No comments