Breaking News

పింగళి వెంకయ్య.. భారత ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన జాతీయ జెండా రూపకర్త


జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య.. మహాత్మాగాంధీ సమకాలికుల్లో ఒకరు.. పింగళి 1876, ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఎన్నో జాతీయ పతాకాలు వినియోగించారు. కానీ, రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31, ఏప్రిల్ 1 వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఈ పతకానికి కొద్దిగా మార్పులు చేశారు. గాంధీ సూచన మేరకు దానిపై 'రాట్నం' గుర్తు చేర్చారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ సూచనమేరకు రాట్నం స్థానంలో అశోకచక్రం వచ్చి చేరింది. ఏప్రిల్‌ 13, 1936 నాటి ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో గాంధీజీ పింగళి వెంకయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారు. 19 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆఫ్రికాలో ఆంగ్లో-బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే మహాత్ముడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 50 ఏళ్ల పాటు అది కొనసాగింది. వెంకయ్య సన్నిహితులు ఆయన్ను జపన్ వెంకయ్య, పత్తి వెంకయ్య, జనద వెంకయ్య అని పలు రకాలుగా పిలుచుకునేవారు. వెంకయ్య గొప్ప దేశభక్తుడు, జియాలజిస్ట్, రచయిత కూడా. 1911-44 వరకు బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు చేసి డిప్లొమా పొందారు. 1924 నుంచి 1944 వరకు నెల్లూరులో మైకా గురించి పరిశోధనలు చేశారు. బొగ్గు వజ్రంగా మారే విధానాన్ని గురించి ‘తల్లిరాయి’ అనే పుస్తకం రాశారు. 1916లో ‘భారతదేశానికి ఒక ’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ గ్రంథంలో సుమారు 30 రకాల పతాకాలను ప్రదర్శించారు. బెజవాడ వేదికగా 1921లో అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలు జరిగినప్పుడు గాంధీజీ.. వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు, మధ్య రాట్నం గల ఒక జెండాను రూపొందించాలని కోరారు. మహాత్ముడు సూచనలతో ఒక జెండాను వెంకయ్య రూపొదించగా.. సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడ్డారు. దీంతో వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించారు. గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణపతాకం పుట్టింది బెజవాడలోనే. కాషాయం హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించారు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింపజేస్తుందన్నారు. కార్మిక, కర్షకులపై ఆధారపడిన భారతదేశం, సత్య హింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం. ఆగస్టు 2న ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలను స్మరించుకుందాం.


By August 02, 2020 at 11:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-national-flag-desinger-freedom-fighter-pingali-venkayya-144th-birth-anniversaray/articleshow/77312322.cms

No comments