Breaking News

మోదీ స్వాతంత్ర దినోత్సవ కానుక.. నేడు ఆరోగ్య రంగంలో కొత్త పథకానికి శ్రీకారం


74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన .. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో అనేకం సాధించామని, ఇంకా పలు సవాళ్లను ఎదుర్కొంటున్నామని అన్నారు. తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి పూర్వీకులు స్వాతంత్రాన్ని తెచ్చారని, స్వాతంత్ర కోసం పోరాడుతున్న అనేక దేశాలకు భారత్ స్ఫూర్తిదాతగా నిలిచిందన్నారు. ప్రపంచంలో స్వాతంత్ర పోరాటాలకు భారత్ ఓ దీపశిఖగా మారి.. విస్తరణవాదం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపిందన్నారు. స్వాతంత్ర సంగ్రామ నిరంతర పోరాటంతో దేశం ముందుకు సాగుతుందన్నారు. ఆత్మ నిర్బర్ భారత్ పేరుతో దేశం మరో ముందడుగు వేయడానికి సిద్ధమయ్యిందని ఉద్ఘాటించారు. ఆత్మనిర్బర్ భారత్ అనేది కేవలం నినాదం కాదని.. దేశం కోసం మన సంకల్పం కావాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచమంతా భారత్ చూపిన బాటలో నడిచి, సరికొత్త ప్రపంచానికి నాంది పలికిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్‌‌‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇది దేశ ఆరోగ్య రంగంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతుందన్నారు. ఇందులోని దేశంలోని ప్రతి పౌరుడికి ఓ ఐడీ నెంబరు కేటాయించి, అతడి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను పొందుపరుస్తామని పేర్కొన్నారు. దీని వల్ల దేశంలో ఎక్కడైనా అతడి ఆరోగ్య వివరాల గురించి వైద్యులకు తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు.


By August 15, 2020 at 09:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-announced-to-launch-the-national-digital-health-mission-from-today/articleshow/77557750.cms

No comments