Breaking News

బాలీవుడ్ దూకుడు చూపించేది ఆయనే..


మహేష్ బాబు దూకుడు చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. 2011లో వచ్చిన ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లో మర్చిపోలేని చిత్రంగా నిలిచిపోయింది. సమంత హీరోయిన్ కనిపించిన ఈ సినిమాని శ్రీనువైట్ల తెరకెక్కించారు. తెలుగులో బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రాలని బాలీవుడ్ లోకి తీసుకెళ్తున్న నిర్మాతలు దూకుడుపై ఆసక్తిపై కనబరిచారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతుందని వార్తలు వచ్చాయి.

ఐతే హిందీలో హీరోగా ఎవరు చేస్తున్నారనేది ఇంకా తెలియకపోయినప్పటికీ దర్శకుడు ఎవరో తెలిసిపోయింది. బాలీవుడ్ హిట్ చిత్రాల దర్శకుడు అనీస్ బజ్మీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడట. నో ఎంట్రీ, వెల్కమ్, సింగ్ ఈజ్ కింగ్, వెల్కమ్ బ్యాక్ చిత్రాలని తెరకెక్కించిన అనీస్ బజ్మీ బాలీవుడ్ దూకుడుని తెరమీద చూపిస్తాడట. ప్రస్తుతం అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన భూల్ బులయ్యా 2 చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. 



By August 31, 2020 at 01:20AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/52392/anees-bajmee.html

No comments