Breaking News

గల్ఫ్ నుంచి వచ్చి భార్య ప్రియుడిని నరికి చంపిన భర్త.. కడపలో దారుణం


వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన జిల్లా సుండుపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని శివరాంపురం గ్రామానికి చెందిన రామాంజులు ఉపాధి నిమిత్తం కొంతకాలం క్రితం గల్ఫ్‌కి వెళ్లాడు. అతడి భార్య, పిల్లలతో కలిసి గ్రామంలోనే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ముడుంపాడుకు చెందిన మౌలా(28) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. Also Read: భర్త అడ్డు లేకపోవడంతో ఆమె మౌలాతో రాసలీలలు సాగిస్తూ వస్తోంది. కొద్దిరోజుల క్రితం గల్ఫ్‌ నుంచి వచ్చిన రామాంజులుకు భార్య అక్రమ సంబంధం గురించి తెలిసింది. దీంతో పద్ధతి మార్చుకోవాలని భార్యను, మౌలాను అతడు హెచ్చరించాడు. అయినప్పటికీ మౌలా ఆమెతో రాసలీలలు కొనసాగిస్తున్నాడు. దీంతో కక్ష పెంచుకున్న రామాంజులు గతనెల 26వ తేదీ మౌలాపై మచ్చు కొడవలితో దాడి చేశాడు. Also Read: ప్రాణ భయంతో తప్పించుకుని పారిపోతున్న అతడిని విచక్షణా రహితంగా నరికి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జులై 31వ తేదీన మామిడితోట శివరాంపురం శివారులోని మామిడి తోట వద్ద సంచరిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన రక్తపు మరకలతో ఉన్న మచ్చుకొడవలిని స్వాధీనం చేసుకున్నారు. Also Read:


By August 02, 2020 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-wife-paramour-in-kadapa-district-accused-arrested/articleshow/77310822.cms

No comments