భర్తను వదిలేసి బంధువుతో అఫైర్... గుంటూరు జిల్లాలో మహిళ దారుణహత్య
జిల్లా ఈపూరు మండలంలోని కూచినపల్లిలో శనివారం మధ్యాహ్నం ఓ వివాహిత దారుణహత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. తాతయ్య, నాయనమ్మ ఇంటికి వచ్చిన ఆమె మధ్యాహ్నం వరండాలో పడుకుని ఉన్న సమయంలో ప్రియుడి గొంతు కోసి చంపేశాడు. గ్రామానికి చెందిన సింగంశెట్టి తేజశ్వి(21) అనే యువతికి కొంతకాలం క్రితమే వివాహమైంది. అయితే మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయిన ఆమె కొద్ది నెలలుగా గుంటూరు నగరం గోరంట్లలోని తండ్రి వద్దే ఉంటోంది. Also Read: ఈ క్రమంలో దగ్గరి బంధువైన దుర్గాప్రసాద్(25)తో ఆమెకు చనువు శారీరక సంబంధానికి దారితీసింది. దుర్గాప్రసాద్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. అయితే తేజస్విని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అతడు ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం తేజశ్వి కూచినపల్లిలోని తాతయ్య, నాయనమ్మ ఇంటికి వచ్చింది. శనివారం మధ్యాహ్నం వరండాలో మంచంపై పడుకుని సెల్‌ఫోన్‌లో పాటలు వింటోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన దుర్గాప్రసాద్ కత్తితో ఆమె గోంతుకోశాడు. కేకలు వేయకుండా గొంతునొక్కి పట్టి పొట్టపైనా వేటు వేశాడు. Also Read: చుట్టుపక్కల వారు చూసి కేకలు వేయడంతో నిందితుడు బైక్‌పై పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో తేజస్విని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై సమాచారం అందుకున్న వినుకొండ గ్రామీణ సీఐ సుబ్బారావు, ఈపూరు ఎస్సై సింగయ్య ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. నిందితుని కోసం గాలిస్తున్నామని, కొచ్చెర్ల సమీపంలో అతడు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నిందితుడు దుర్గాప్రసాద్ శనివారం సాయంత్రమే ఈపూరు పోలీసుల వద్ద లొంగిపోయినట్లు తెలుస్తోంది. Also Read:
By August 02, 2020 at 08:01AM
No comments