బిగ్ బాస్ లోకి ఆ ఇద్దరు యాంకర్లు..?
కరోనా కారణంగా వినోదమంతా ఓటీటీకే పరిమితమైన నేపథ్యంలో టీవీలో ప్రసారం కాబోయే బిగ్ బాస్ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ బిగ్ బాస్ నాలుగవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ నాలుగవ సీజన్లో వచ్చే కంటెస్టెంట్ల విషయమై రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించాయి. అందులో డాన్స్ మాస్టర్ రఘు, జానపద గాయని మంగ్లీ, నోయల్ సేన్, రమ్య పసుపులేటి, ప్రియా వడ్లమాని ఉన్నారు.
అయితే వీరందరితో పాటు తాజాగా ఇద్దరు యాంకర్లు హౌస్ లోకి వెళ్తున్నారని అంటున్నారు. యాంకర్ మంజూష, విష్ణుప్రియ.. వీరిద్దరూ హౌస్ లోకి వెళ్ళనున్నారట. వీరిద్దరికీ బుల్లితెర మీద మంచి ఫాలోయింగ్ ఉంది. అందువల్ల హౌస్ ని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు, బుల్లితెర ప్రేక్షకులకి మరింత దగ్గర చేసేందుకు ఈ యాంకర్స్ ని తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే వీరందరూ హౌస్ లోకి వస్తున్నారా లేదా అనే విషయం అధికారికంగా తెలియాలంటే బిగ్ బాస్ స్టార్ట్ కావాల్సిందే. కరోనా కట్టుబాట్ల నడుమ మొదలవుతున్న ఈ షో గతంలోలా వందరోజులు కాకుండా డెభ్బై రోజులు మాత్రమే ఉంటుందట.
By August 03, 2020 at 12:52AM
No comments