బిర్యానీ కోసం అన్నతో గొడవ.. మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

బిర్యానీ తినే విషయంలో అన్నతో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మల్లాపూర్ డివిజన్‌లోని దుర్గానగర్‌కు చెందిన ప్రశాంతి, రవి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె స్నేహ (11) ఉన్నారు. శనివారం తల్లిండ్రులు కూలిపనికి వెళ్లడంతో స్నేహా అన్నతో పాటు ఇంట్లోనే ఉంది. ఆరోజు బక్రీద్ సందర్భంగా పక్కింట్లో ఉంటే ఓ ముస్లిం కుటుంబం వారికి బిర్యానీ ఇచ్చింది. Also Read: దీంతో బిర్యానీ తినే విషయంలో అన్నతో స్నేహ గొడవ పడింది. కాసేపటికే అన్న స్నేహితులతో ఆడుకునేందుకు బయటికి వెళ్లగా స్నేహ ఇంట్లోనే టవల్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఉరికి వేలాడుతున్న ఆమెను చూసి షాకయ్యారు. వెంటనే నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి ప్రశాంతి ఫిర్యాదు మేరకు నాచారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By August 03, 2020 at 10:23AM
No comments