Breaking News

హైదరాబాద్: చైల్డ్‌ పోర్నోగ్రఫీని సెర్చ్‌ చేసిన ఇద్దరి అరెస్ట్


ఆన్‌లైన్లో చూసేవారికి ఇది చేదువార్తే. స్మార్ట్‌ఫోన్ల యుగం ప్రారంభమయ్యాక చాలామంది మొబైల్స్‌లో పోర్న్ వీడియోలు చూడటానికి అలవాటు పడ్డారు. కొందరైతే పసిపిల్లలతో చేసే పోర్న్ వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి వారికి హైదరాబాద్‌ పోలీసులు గట్టి హెచ్చరికలు పంపిస్తున్నారు. ఇంటర్నెట్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామంటున్నారు. తాజాగా ఈ నేరానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read: మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చైల్డ్‌ పోర్నోగ్రఫీ నిషేధించినట్లు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఇంటర్నెట్‌లో ఎవరు సెర్చ్‌ చేసినా, ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేసినా నేషనల్‌ క్రైం రికార్డ్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)లో నమోదవుతుందని తెలిపారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన 15 మంది వివరాలను ఎన్‌సీఆర్‌బీ అధికారులు సీఐడీకి పంపినట్లు వెల్లడించారు. వారిలో ఇద్దరిని తాజాగా అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. Also Read: తార్నాకకు చెందిన మహమ్మద్‌ ఫిరోజ్‌, కాచిగూడకు చెందిన ప్రశాంత్‌ కుమార్‌ 2019లో చైల్డ్ పోర్నోగ్రఫీని సెర్చ్‌ చేసినట్లు తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. దీంతో పాటు ఆయా పోర్న్ సైట్లలో ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేసినట్లు గుర్తించామన్నారు. మరో 13 మంది వివరాలను ఆయా జిల్లాల పోలీసులకు సీఐడీ పోలీసులు పంపారు. నిషేధిత చైల్డ్ పోర్నోగ్రఫీని సెర్చ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. Also Read:


By August 07, 2020 at 07:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-hyderabad-men-arrested-for-searching-child-pornography-in-internet/articleshow/77404834.cms

No comments