Breaking News

దొంగబాబా కామక్రీడలు.. కోరిక తీర్చకపోతే చేతబడే.. శ్రీకాళహస్తిలో దారుణం


తనకు మంత్ర శక్తులు ఉన్నాయని.. పూజలతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మిస్తాడు. తన వద్దకు వచ్చిన మహిళలు, యువతులను పూజల పేరుతో లోబరుచుకుని కామవాంఛలు తీర్చుకుంటాడు. ఎదురు తిరిగితే చేతబడి చేసి కుటుంబాన్ని చంపేస్తానంటూ భయభ్రాంతులకు గురిచేస్తాడు. అమాయకులైన యువతులను బలవంతంగా లొంగదీసుకుంటున్న కీచక బాబా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన ఏపీలోని శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. పట్టణంలోని పూసలవీధికి చెందిన ఓ వ్యక్తి బాబా అవతారమెత్తాడు. తన మంత్రశక్తులతో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని నమ్మించి పలువురు మహిళలు, యువతులను లోబరుచుకున్నాడు. మాయమాటలు చెప్పి కామకోరికలు తీర్చుకునేవాడు. మరో ఇద్దరు యువతులపై కన్నేసిన .. వారిని లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. Also Read: తన కోరిక తీర్చకపోతే చేతబడి చేసి ఏకంగా కుటుంబాన్నే చంపేస్తానంటూ బెదిరించడంతో భయపడిపోయిన యువతులు అసలు విషయం ఇంట్లో చెప్పేశారు. బాధితులను వెంటబెట్టుకుని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో కీచకబాబా చీకటి యవ్వారం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు కీచకబాబాని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో ఓ అధికార పార్టీ నేత జోక్యం చేసుకుని రాజీకి యత్నించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. Read Also:


By August 01, 2020 at 02:12PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/fake-baba-arrested-for-cheating-girls-in-srikalahasti/articleshow/77300008.cms

No comments