Breaking News

అదను చూసి కోరిక బయటపెట్టిన యంగ్ హీరోయిన్.. హీరో కూడా సై అనడంతో చివరకు! ఇదీ మ్యాటర్


సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తుండటంతో మనిషి మనిషి మధ్యదూరం చాలా తగ్గిపోయింది. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు, మనసులో ఉన్న మాట పంచుకునేందుకు సామాజిక మాధ్యమాలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యంగ్ హీరోయిన్ అదును చూసి కోరిక బయటపెట్టేసింది. అంతేకాదు ఒక్క మెసేజ్‌తోనే ఆమె కోరుకున్న అవకాశం దక్కించుకొని షాకిచ్చింది. దీంతో సోషల్ మీడియాను ఇలా కూడా వాడుకోవచ్చా! అని ఆశ్చర్యపోతున్నారు జనం. జులై 28వ తేదీ హీరో పుట్టిన రోజు జరిగింది. కరోనా కారణంగా ఏ హంగు ఆర్భాటాలకు పోకుండా తన పుట్టినరోజు వేడుకను ఇంటి దగ్గరే నిరాడంబరంగా జరుపుకున్నారు ధనుష్. అయితే ధనుష్‌కి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పిన హీరోయిన్ మాళవికా మోహనన్‌ ఓ కోరిక కోరింది. ''హ్యాపీ బర్త్ డే ధనుష్. రాబోయే రోజుల్లో అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా. నీతో నటించాలని చాలా ఉత్సాహంగా ఉంది. ఎవరో ఒక నిర్మాత మనిద్దరిని జంటగా నటింపజేస్తారని ఆశిస్తున్నా'' అంటూ ట్వీట్ చేసింది మాళవిక. Also Read: దీంతో ఈ ట్వీట్‌పై రియాక్ట్ అయిన హీరో ధనుష్.. త్వరలోనే నీ కోరిక తీరుతుందని పేర్కొన్నారు. ఇంతలోనే ధనుష్‌ హీరోగా కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో రాబోతున్న ‘డీ43’ చిత్రంలో హీరోయిన్‌గా మాళవికా మోహనన్‌ని తీసుకుంటామని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆ చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. దీంతో మాళవికా మోహనన్‌ కోరిక, కోరుకున్న హీరోతో సినిమా ఛాన్స్ అంశం సినీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.


By August 01, 2020 at 01:22PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/malavika-mohanan-reveals-her-desire-to-romance-with-young-hero/articleshow/77299381.cms

No comments