సరిహద్దుల్లో మరోసారి పాక్ సైన్యం దుస్సాహాసం.. జవాన్ వీరమరణం
పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. ఈ ఘటనలో ఓ జవాన్ అమరుడయ్యాడు. నియంత్రణ రేఖ వెంబడి జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. పూంచ్ జిల్లాలోని వద్ద రాజౌరీ సెక్టార్‌లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు పాల్పడగా.. భారత్ దీటుగా బదులిచ్చింది. ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీకి చెందిన రోహిత్ కుమార్ అనే జవాన్ తీవ్రంగా గాయపడినట్టు రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ పేర్కొన్నారు. పాక్ సైన్యం కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రోహిత్ కుమార్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడని అన్నారు. జవాన్ రోహిత్ కుమార్ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా. గడచిన రెండు నెలలుగా పూంచ్, రాజౌరీ సెక్టార్‌లో పాకిస్థాన్ సైన్యం జరిపిన వేర్వేరు కాల్పుల్లో ఏడుగురు సైనికులు అమరులయ్యారు. ఈ ఏడాది ఇప్పటి వరకు పాక్ సైన్యం 2,700 సార్లు కాల్పులు ఉల్లంఘనకు పాల్పడింది. గతేడాది పోలిస్తే 50-60 శాతం మేర పాక్ సైన్యం దురాగతాలు పెరిగాయని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
By August 01, 2020 at 01:02PM
No comments