తల్లికి మత్తు మందిచ్చి కూతురిపై అత్యాచారం... కోనసీమలో కామాంధుడు

జిల్లాలో దారుణం జరిగింది. మామిడికుదురు మండలంలోని మొగలికుదురు గ్రామానికి చెందిన మైనర్ బాలిక(15)పై పొదలాడ గ్రామానికి చెందిన గుబ్బల రాజేంద్ర కుమార్(21) అనే యువకుడు సోమవారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొన్నాళ్లుగా బాలికపై కన్నేసిన రాజేంద్ర సోమవారం ఆమె తల్లి తాగే టీలో నిద్రమాత్రలు కలిపాడు. టీ తాగిన తర్వాత ఆమె మత్తులోకి జారుకోవడంతో బాలికను బెదిరించి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: బాలిక కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకునే సరికే నిందితుడు పరారయ్యాడు. కాసేపటి తర్వాత మత్తులో నుంచి తేరుకున్న బాలిక తల్లి జరిగిన దారుణం తెలుసుకుని షాకైంది. కూతురితో కలిసి వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read:
By August 11, 2020 at 06:52AM
No comments