Breaking News

ఆరేళ్లుగా ప్రేమ.. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి అఘాయిత్యం


ప్రేమ పేరుతో వెంట తిప్పుకున్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగింది. మందమర్రికి చెందిన సాయిప్రసన్న, భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిడ్నాపల్లికి చెందిన సాగర్‌ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామని సాయి ప్రసన్న ఎన్నిసార్లు కోరినా సాగర్ వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఇటీవల ఆమె గట్టిగా నిలదీయడంతో పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ప్రసన్న రెండ్రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: దీంతో పోలీసులు ఇరువర్గాల పిలిపించగా.. తాము పెద్దల సమక్షంలో మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని చెప్పారు. ఆదివారం పంచాయతీ జరగ్గా ఎలాంటి పరిష్కారం లభించలేదు. దీంతో మనస్తాపానికి గురైన సాయిప్రసన్న గదిలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయింది. ఆమెను అడ్డుకున్న స్థానికులు వెంటనే సింగరేణి ఆస్పత్రికి.. అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై అమ్మాయి తరపు వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ వర్గం వారు తమపై దాడికి పాల్పడ్డారని సాగర్ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రెండు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By August 10, 2020 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-try-to-commits-suicide-in-mancherial-district-over-boyfriend-resufed-to-marry/articleshow/77456119.cms

No comments