బీపీ మాత్రలతో కరోనాకు చెక్.. గణనీయంగా తగ్గుతున్న మరణాలు!

కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు మందు కనుగొనలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాక్సిన్లు కీలక ప్రయోగ దశలో ఉన్నాయి. వ్యాక్సిన్‌ను కనుగొన్నామని రష్యా ప్రకటించినప్పటికీ.. దానిపై అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19పై కొన్ని రకాల మందులు ఆశాజనకమైన పనితీరు కనబరుస్తుండటం ఊరటనిస్తోంది. బ్రిటన్‌లో కోసం వాడే మందులు కరోనా కారణంగా మరణించే ముప్పును 33 శాతానికిపైగా తగ్గిస్తున్నాయని పరిశోధనలో వెల్లడైంది. యాంజియోటెన్సిన్- కన్వర్టింగ్ ఎంజైమ్ (ఏసీఈ), యాంజియోటెన్సిన్ రిసెపర్టర్ బ్లాకర్స్ (ఏఆర్‌బీ) అనే మందులను హైబీపీ, హార్ట్ ఎటాక్, డయాబెటిస్ కోసం వాడుతుంటారు. ఈ మందులు వేసుకున్న వారిలో కరోనా కారణంగా చనిపోయే ముప్పు గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. కోవిడ్-19 హాస్పిటల్‌లో 28,872 మంది పేషెంట్ల వివరాలను పరిశీలించిన యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఎంజిలా పరిశోధకులు ఈ వివరాలను వెల్లడించారు. కరోనా చికిత్సలో భాగంగా హై బీపీ లేని వారు ఈ ఔషధాలను సైతం వేసుకోవచ్చా అనే దిశగా మరింతగా పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలతో బాధపడుతున్న పేషెంట్లు ఏసీఈ, ఏఆర్‌బీలను వాడినప్పుడు వారిలో కరోనా తీవ్రత తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. కరోనా రాక ముందు నుంచి ఈ మందులు వాడుతున్న వారిలో కోవిడ్ ప్రభావం తక్కువగా ఉంది కానీ.. కరోనా వచ్చాక వేసుకుంటే వైరస్ ప్రభావం తక్కువగా ఉందని చెప్పడానికి ఆధారాల్లేవని పరిశోధకులు తెలిపారు.
By August 24, 2020 at 10:06AM
No comments