మహబూబాబాద్: పక్కింటి వ్యక్తిని భయపెట్టేందుకు స్నేహితుడి హత్య

ఓ వ్యక్తిని భయపెట్టేందుకు మరో వ్యక్తిపై దాడి చేసేందుకు చేసిన ప్రయత్నం అమాయకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. స్థల వివాదం నేపథ్యంలో పొరుగింటి వ్యక్తిని భయపెట్టేందుకు అభంశుభం తెలియని తన స్నేహితుడిని అత్యంత కిరాతకంగా హతమార్చాడో వ్యక్తి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన వెంకన్న(46).. పది సంవత్సరాల క్రితం కేసముద్రం మండలం వచ్చి కాగితాలు, అట్టలు ఏరుకుని విక్రయిస్తూ రైల్వేస్టేషన్ సమీపంలో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. ఇదే మండలంలోని గిర్నితండాకు చెందిన ఆంగోతు హరీష్‌కు వెంకన్నతో పరిచయం ఉంది. Also Read: కొంతకాలంగా హరీష్‌కు తన ఇంటి పక్కన ఉన్న కర్పూరపు గోపాల్‌తో ఇంటి స్థల విషయమై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే గోపాల్‌ను ఎలాగైనా భయపెట్టి స్థలాన్ని కాజేయాలని హరీష్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఎవరూలేని వెంకన్నను చంపేసి గోపాల్‌ను భయపెట్టాలని ప్లాన్ వేశాడు. ఆదివారం రాత్రి వెంకన్నను తన ఇంటికి పిలిచి ఇద్దరూ మద్యం సేవించారు. తర్వాత హరీష్ పారతో వెంకన్న మెడపై నరికి చంపేశాడు. Also Read: ఆ తర్వాత తలను శరీరం నుంచి వేరు చేశాడు. మొండాన్ని గోపాల్ ఇంటి స్థలంలోను, తలను సంచిలో పెట్టుకుని మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ సమీపంలోని ఓ ఇంటి పక్కన పడేశాడు. సోమవారం ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హరీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. ఈ ఘటన వివరాలను ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మీడియాకు వివరించారు. Also Read:
By August 25, 2020 at 07:06AM
No comments