Breaking News

Kurnool: ప్రియురాలితో వెళ్లిపోయిన భర్త.. బిడ్డతో సహా మహిళ ఆత్మహత్య


జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త మరో మహిళ మోజులో పడి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. అయినప్పటికీ బిడ్డ భవిష్యత్ కోసం అత్తమామలతో కలిసి బ్రతుకు బండిని లాగిస్తోంది. అయితే కొద్దిరోజులకు ప్రియురాలితో కలిసి తిరిగొచ్చిన భర్త వేధింపులకు గురిచేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. తాను లేకపోతే బిడ్డ ఏమవుతుందోనన్న ఆందోళనతో చిన్నారితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన జిల్లా మండలంలో వెలుగుచూసింది. Also Read: ఆలూరు మండల కేంద్రానికి చెందిన ఏకనాథం ఈరన్న, హేమావతి కుమారుడు ఏకనాథం నాగార్జున అలియాస్‌ నాగేంద్రకు కర్ణాటకలోని ధరూరు గ్రామానికి చెందిన మేనమామ కూతురు శిల్ప(20)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి జ్ఞానేశ్వరి(2) అనే కూతురు ఉంది. డిగ్రీ చదివిన నాగార్జునకు బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది ఆకర్షణగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమెను వదిలి ఉండలేనని నిర్ధారించుకున్న నాగార్జున ఏడాది క్రితం భార్య బిడ్డలను వదిలేసి ప్రియురాలితో వెళ్లిపోయాడు. Also Read: దీంతో మనస్తాపానికి గురైన శిల్ప.. బిడ్డ, అత్తమామలతో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలోనే నాగార్జున ప్రియురాలి తరపు బంధువులు శిల్పను వేధింపులకు గురిచేసేశారు. తన భర్త ఎక్కడున్నాడో తెలియదని ఆమె చెప్పినా వినిపించుకోకుండా మానసికంగా క్షోభకు గురి చేసేశారు. ఈ క్రమంలోనే భర్త నాగార్జున రెండ్రోజుల క్రితం ప్రియురాలితో కలిసి ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి శిల్పను తీవ్రంగా వేధించారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఆదివారం అత్తమామలతో కలిసి పొలానికి వెళ్లిన శిల్ప పక్కనే ఉన్న నీటి కుంటలో కూతురితో కలిసి దూకేసింది. Also Read: ఆమెను గమనించిన అత్తమామలు స్థానికుల సాయంతో వెలికి తీయగా అప్పటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. భర్త నాగార్జున, అతడి ప్రియురాలి బంధువుల వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. శిల్ప తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read:


By August 24, 2020 at 09:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-commits-suicide-with-daughter-in-kurnool-over-her-husband-eloped-with-lover/articleshow/77713144.cms

No comments