Breaking News

కరోనాతో మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ పాటిల్ మృతి


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివాజీరావ్ పాటిల్ నీలంగేకర్ మరణించారు. గత నెల 16న కరోనాతో ఆయన పుణెలోని ఓ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే శివాజీరావ్ చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో పాటిల్‌ ఈ రోజు ఉదయం మరణించారని హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం ఆయన వయసు 91 ఏళ్లు. మహారాష్ట్రలోని లాతూర్ ఆయన స్వస్థలం. 1985 జూన్ నుంచి 1986 మార్చి వరకు శివాజీరావ్ పాటిల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎండీ పరీక్షలో తన కుమార్తెకు అక్రమంగా మార్కులు వేయించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు బాంబే హైకోర్టు తీర్పునివ్వడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. Read More: 1968లో మహారాష్ట్ర ఎడ్యుకేషన్ ట్రస్ట్‌ను పాటిల్ స్థాపించారు. తన ఎడ్యుకేషన్ సొసైటీలో నాలుగు సీనియర్ కాలేజీల చుట్టూ, 12 హయ్యర్ సెకండరీ పాఠశాలలు మరియు 15 ప్రాథమిక పాఠశాలలు నిర్మించారు. మహారాష్ట్ర ఫార్మసీ కళాశాల, నీలంగ, www.mcpnilanga.com 1984లో పాటిల్ స్థాపించారు. మహారాష్ట్ర పాలీ. (డి.ఫార్మసీ) ఇన్స్టిట్యూట్ నీలంగ ప్రభుత్వం ఎయిడ్ 1981 లో ప్రారంభమైంది. 1983 లో మహారాష్ట్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రారంభించారు.పాటిల్‌కు పుస్తకాల పఠనం, శాస్త్రీయ సంగీతం, వాలీబాల్ మరియు టేబుల్ టెన్నిస్ అంటే చాలా ఇష్టం.


By August 05, 2020 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/maharashtra-former-cm-shivajirao-patil-nilangekar-passed-away/articleshow/77363619.cms

No comments