Breaking News

రామమందిరం కోసం 28ఏళ్లుగా ఉపవాసం.. త్వరలో ముగించనున్న కలియుగ ఊర్మిళ


అయోధ్యలో రాముడికి ఆలయం నిర్మించేవరకూ ఆహారం తీసుకోనని దీక్ష చేపట్టిన ఓ అభినవ ఊర్మిళ.. శపథం నేడు నేరవేరబోతుంది. ఒకటి రెండు కాదు 28ఏళ్లుగా ఆమె చేస్తున్న నిరాహారదీక్షకు ముగింపు లభించనుంది. రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరగనుండగా.. ఆ రామభక్తురాలి దీక్ష సాకరమవుతోంది. మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌కు చెందిన ఊర్మిళ చతుర్వేది (82) అనే మహిళ డిసెంబర్‌ 6, 1992లో అయోధ్యలోని వివాదాస్పదకట్టడం నేలమట్టమైనప్పటి నుంచి ఉపవాసదీక్ష చేస్తున్నారు. రాముడికి మళ్లీ గుడి కట్టిన తరవాత మాత్రమే తాను ఆహారం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని, అక్కడ రామమందిరం నిర్మించవచ్చని సుప్రీంకోర్టు గతేడాది తీర్పు వెలువరించిన రోజు ఆమె ఎంతో ఆనందించారు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఎంతగా వేడుకున్నా ఆమె తన ఉపవాస దీక్షను మాత్రం విరమించలేదు. తాను అయోధ్యకు వెళ్లి ఆ శ్రీరాముని మందిరాన్ని దర్శించడం తనకు పునర్జన్మ వంటిదని ఆమె అన్నారు. రామమందిర శంకుస్థాపన తరవాత అయోధ్యకు వెళ్లి, సరయూ నదిలో పవిత్రస్నానం చేసి ఉపవాస దీక్ష విరమిస్తానని ఊర్మిళ స్పష్టంచేశారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘శ్రీరాముడు తన భక్తులను ఎప్పటికీ నిరాశ పరచడు. త్రేతాయుగం నాటి శబరి అయినా ఈ యుగం నాటి ఊర్మిళమ్మయినా! అమ్మా, మీ భక్తికి ప్రణమిల్లుతున్నాను. యవద్భారతావని మీకు వందనాలు అర్పిస్తోంది! జై శ్రీరాం!’ అని ట్వీట్‌ చేశారు.


By August 05, 2020 at 08:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/a-82-years-old-woman-from-madhya-pradesh-fasting-for-past-28-years-for-ram-mandir-construction/articleshow/77363349.cms

No comments