బెంగళూరు, కర్ణాటక వెళ్లానుకునేవారికి గుడ్‌న్యూస్

బెంగళూరు, వెళ్లానుకునేవారికి గుడ్‌న్యూస్. ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లాలనుకునేవారికి ప్రయాణ ఆంక్షలను సులభతరం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆంక్షల సడలింపుల్లో భాగంగా అంతరాష్ట్ర రాకపోకలపై ఇప్పటివరకూ విధించిన నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక వెళ్లేవారు కరోనా లక్షణాలు లేకపోతే హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. దీంతో , కర్ణాటక వెళ్లేవారికి ఊరట లభించింది.. ఇటీవల అంతర్రాష్ట సరిహద్దుల్లో రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేయాలని కేంద్రం సూచించింది. దీంతో యడియూరప్ప సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక, బెంగళూరు వెళ్లేవారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే హోం క్వారంటైన్‌లో ఉండి ఆప్తమిత్ర హెల్త్ లైన్ నంబర్ 14410కి ఫోన్ ద్వారా కానీ.. వైద్యులను సంప్రదించి కానీ చికిత్స పొందే అవకాశాన్ని ప్రభుత్వం సూచించింది. అలాగే ఇప్పటివరకూ ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వెళ్లేవారు సేవా సింధు పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాల్సి ఉండేది.. ఇక నిబంధన కూడా వర్తించదు. అంతేకాదు బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో వచ్చేవారికి కరోనా టెస్టులు చేయరు. ప్రయాణాలు, క్వారంటైన్ నిబంధనల సంగతి అలా ఉంటే.. మాస్క్, భౌతిక దూరం వంటి నిబంధనల్ని అందరూ పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. లక్షణాలు ఉన్నవారు అప్రమత్తంగా వ్యవహరించి ఎవరికి వారు టెస్టులు చేసుకోవాలని సూచించింది. బయటకు వచ్చే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు ఎత్తేయడంతో రాకపోకలు మళ్లీ కొనసాగనున్నాయి.
By August 25, 2020 at 11:06AM
No comments