Breaking News

9మందిని చంపిన సింహాద్రి.. ఆట కట్టించిన పోలీసుల పంట పండింది


కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో వరుసగా తొమ్మిది హత్యలకు పాల్పడిన సీరియల్‌ కిల్లర్‌ సింహాద్రి పోలీసులకు నిద్ర పట్టకుండా చేశాడు. ఎంతో చాకచక్యంగా ఆ కేసును చేధించిన పోలీసు సబ్‌డివిజన్‌ ఇప్పుడు రాష్ట్ర అవార్డుకు ఎంపికైంది. కేసుల దర్యాప్తులో ప్రతిభ చాటిన పోలీసు అధికారులకు ఏటా డీజీపీ ఆధ్వర్యంలో అవార్డులు అందిస్తుంటారు. వీటిని ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి అవార్డులు ప్రదానం చేస్తార. ఈ ఏడాది ఏలూరు పోలీసు సబ్‌డివిజన్‌ ఏ కేటగిరీలో అవార్డు సాధించింది. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చేతుల మీదుగా ఏలూరు డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌ ఈ అవార్డు అందుకోనున్నారు. Also Read: నరరూప రాక్షసుడు సింహాద్రి... జిల్లా ఏలూరు శివారు వట్లూరు వద్ద 2019 అక్టోబరులో ఓ ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీనిపై త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌ ఆధ్వర్యంలో రూరల్‌ సీఐ అనసూరి శ్రీనివాసరావు కేసును దర్యాప్తు చేశారు. హనుమాన్‌నగర్లో నివాసముండే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వెల్లంకి సింహాద్రి ఈ హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. అతడిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారించగా మరిన్ని నేరాలు వెలుగులోకి వచ్చాయి. Also Read: సింహాద్రి తనకు పరిచయం ఏర్పడిన వారిని నమ్మించి విలువైన రంగురాళ్లు ఉన్నాయని, వాటితో కోట్లు సంపాదించవచ్చని నమ్మించేవాడు. వారి నుంచి డబ్బు కాజేసిన అనంతరం ప్రసాదంలో సైనైడ్‌ కలిపి ఇచ్చేవాడు. ఇలా మూడు జిల్లాల్లో తొమ్మిది మందిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి అతడిని కటకటాల్లోకి నెట్టారు. Also Read:


By August 12, 2020 at 12:12PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/serial-killer-vellanki-simhadri-case-investigation-police-selects-dgp-award/articleshow/77499392.cms

No comments