Breaking News

అనంతపురం: ఎస్ఐ ఇంటికే కన్నమేసిన దొంగలు...రూ.70 వేలు చోరీ


జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసు ఇంటికే కన్నమేసి రూ.70వేలు చోరీ చేశారు. జిల్లాలోని పామిడి గుప్తా కాలనీలో నివాసముంటున్న ఎస్ఐ గంగాధర్‌ గంగాధర్‌ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి తన బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్‌కు హాజరయ్యారు. సోమవారం తిరిగి ఇంటికి వచ్చిచూడగా తలుపులకు వేసిన తాళం పగులగొట్టి కనిపించింది. దీంతో ఆయన వెంటనే లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. Also Read: అందులో దాచిన రూ.70వేల నగదు కనిపించలేదు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతపురం నుంచి వేలిముద్రల నిపుణులు ఏఎస్సై చంద్రశేఖర్‌, తన సిబ్బందితో వచ్చి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి గుప్తా కాలనీ శివారున మరో రెండు ఇళ్లలో దొంగలు పడ్డారు. అయితే తమ ఇళ్లలో ఎలాంటి వస్తువులు చోరీకి గురి కాలేదని ఇళ్ల యజమానులు తెలిపారు. Also Read:


By August 11, 2020 at 09:20AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/70000-rupees-robbery-in-police-sub-inspector-house-in-anantapur/articleshow/77476249.cms

No comments