Breaking News

ఆన్‌లైన్‌ గేమ్‌లో రూ.7లక్షలు నష్టం.. హైదరాబాద్‌లో యువకుడి ఆత్మహత్య


స్మార్ట్‌ఫోన్ల కాలం వచ్చాక సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు మాయమైపోతున్నాయి. ముఖ్యంగా లాక్‌డౌన్ కాలంలో ప్రజలు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో అన్ని అవసరాలకు ఆన్‌లైన్‌ మీదే ఆధారపడ్డారు. దీన్ని అవకాశంగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు రూ.లక్షలు దోచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా యువతి ఆన్‌లైన్‌ గేమ్స్‌ బానిసై అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు విషాదం నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌లో డబ్బు పోగొట్టుకున్న ఓ యువకుడు అప్పులపాలై వాటిని తీర్చలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. Also Read: జిల్లా పత్తికొండ మండలం మద్దికెర గ్రామానికి చెందిన మహేష్‌(29) ఎంబీఏ పూర్తి చేశాడు. రెండేళ్ల క్రితం వచ్చి మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ ఎల్లారెడ్డిగూడ సమీపంలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఇటీవల ఓ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ గేమింగ్‌కు అలవాటు పడ్డాడు. రెండేళ్లుగా కూడబెట్టిన డబ్బుతో పాటు స్నేహితులు, తోటి ఉద్యోగుల నుంచి అప్పులు చేసి ఆటలో కోల్పోయాడు. ఇలా రూ.7 లక్షల వరకు నష్టపోయాడు. Also Read: ఓ వైపు ఆటలో కోల్పోయిన డబ్బులు తిరిగొచ్చే పరిస్థితి లేకపోవడం, అందరి దగ్గర చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక మహేష్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తనకు ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో తాను చనిపోతున్నానంటూ లేఖ రాసి పెట్టి ఆదివారం తన గదిలోనే ఉరేసుకున్నాడు. తాను ఎవరెవరి దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో లేఖలో పేర్కొన్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మహేష్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అతడి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read: Also Read:


By August 03, 2020 at 07:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kurnool-man-commits-suicide-in-hyderabad-after-losing-rs-7-lakhs-in-online-game/articleshow/77324059.cms

No comments