Breaking News

60ఏళ్ల మహిళపై యువకుడి అత్యాచారం.. కృష్ణా జిల్లాలో దారుణం


కామంతో కళ్లు మూసుకుపోయిన యువకుడు 60 ఏళ్ల వృద్ధురాలిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన నీచ ఘటన కృష్ణా జిల్లా మండలంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. మండల కేంద్రానికి సమీపాన ఉన్న ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. సోమవారం రాత్రి 10 గంటల తర్వాత తన పూరింట్లో నిద్రపోయింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు(21) ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో నివసిస్తున్న ఓ మహిళ ఆ ఇంటి వద్దకు వచ్చింది. అయితే వృద్ధురాలు అరవకుండా యువకుడు గట్టిగా నోరు నొక్కేయడంతో అరుపులు వినిపించక ఆ మహిళ తిరిగి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి వృద్ధురాలు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. స్థానికులను చూసిన యువకుడు సమీపంలోని పొలాల్లోకి పరుగు తీశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు కలిదిండి ఎస్ఐ జనార్దన్ తెలిపారు. Also Read:


By August 12, 2020 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/21-yr-old-man-rapes-old-woman-in-krishna-district/articleshow/77496524.cms

No comments