Breaking News

విశాఖ: ఒకే వ్యక్తితో తల్లీకూతుళ్ల అఫైర్.. రూ.30లక్షలతో పరారైన ప్రియుడు


మగదిక్కు లేని తల్లీకూతుళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుని వారి నుంచి లక్షల నగదు దోచుకుని పరారైన నిందితుడిని విశాఖ కంచరపాలెం పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. విశాఖ జిల్లా అప్పన్నపాలెం ప్రాంతానికి చెందిన మహిళకు భర్త చనిపోయాడు. ఆమె కూతురు కూడా భర్తను వదిలేసి తల్లి వద్దే ఉంటోంది. వీరిద్దరు కలిసి వడ్డీ వ్యాపారం చేస్తూ బాగా సంపాదించారు. వీరి ఆస్తిపై కన్నేసిన అదే ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి నాగ వెంకట చలపతి అలియాస్‌ చిన్ని అనే వ్యక్తి మాయమాటలతో ముందు తల్లికి దగ్గరయ్యాడు. Also Read: ఆమెను శారీరకంగా లొంగదీసుకుని తన అవసరాలకు డబ్బులు తీసుకునేవాడు. కొన్నాళ్ళ తర్వాత భర్తకు దూరంగా ఉంటున్న ఆమె కుమార్తెపై కూడా కన్నేసి లోబరుచుకున్నాడు. తల్లీకూతుళ్లకి తెలియకుండా ఇద్దరితోనూ రాసలీలలు కొనసాగిస్తూ వచ్చాడు. కొద్దిరోజుల తర్వాత ఓ ఫ్లాట్‌ కొంటానని చెప్పి దఫదఫాలుగా రూ.30 లక్షలు నగదు తీసుకున్నాడు. ఫ్లాట్‌ ఎంతకీ కొనకపోవడంతో తల్లీకూతుళ్లు అతడిని గట్టిగా నిలదీశారు. Also Read: దీంతో వారితో ఉన్న అక్రమ సంబంధాలను బయటపెడతానని చిన్ని తల్లీకూతుళ్లను బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో బాధితురాళ్లు కంచరపాలెం పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడి కోసం తీవ్రంగా గాలించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు సోమవారం ఖమ్మం నుంచి విశాఖ వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు మంగళవారం అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. Also Read:


By August 12, 2020 at 10:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-arrested-for-cheating-rs-30-lakhs-from-two-women-in-vizag/articleshow/77497737.cms

No comments