Breaking News

హైదరాబాద్: ప్రముఖ సినీ గాయని పేరుతో రూ.1.7 కోట్లకు టోకరా


ప్రముఖ సినీ గాయని పేరుతో కేటుగాళ్లు ఓ మహిళ నుంచి ఏకంగా రూ.1.7కోట్లు కొట్టేసిన ఘటన నగరంలో జరిగింది. దీనిపై బాధితురాలు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని కొత్తపేటకు చెందిన ఓ మహిళ(44) టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ గాయనికి వీరాభిమాని. 2019లో ఆమె ఇంటి దగ్గరుండే చైతన్య అనే వ్యక్తి ఆ సింగర్ వాట్సాప్‌ నంబర్‌ ఇచ్చాడు. రెండు, మూడు సార్లు వాట్సాప్‌లో ఆమె మెసేజ్‌ చేయగానే సింగర్ ఆ నంబర్‌ను బ్లాక్‌ చేసేశారు. Also Read: దీంతో మనస్తాపం చెందిన మహిళ ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి’ అంటూ వేరే నంబర్‌ నుంచి మెసేజ్‌ చేసింది. పర్లేదంటూ.. అవతలి నుంచి మెసేజ్ రావడంతో ఆ మహిళ తరుచూ ఛాటింగ్‌ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కేరళలోని ‘ఆనంద చేర్లాయం ట్రస్ట్‌’లో రూ.50 వేలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని చెప్పడంతో బాధితురాలు ఆమె సూచించిన బ్యాంకు ఖాతాకు డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆ తర్వాత అమెరికాలో ఉన్న భూములను అమ్మకానికి పెట్టానంటూ నమ్మించి అనేక విడతలుగా రూ.1.7 కోట్ల వరకు వసూలు చేసింది. Also Read: అయితే ఇంత జరుగుతున్నా ఆ సింగర్ ఎప్పుడూ వీడియో కాల్‌లో మాట్లాడేది కాదు. బాధితురాలు వీడియో కాల్‌ మాట్లాడాలని కోరినప్పుడల్లా వాట్సాప్‌లో తన ఫోటోలు పంపేంది. దీంతో అనుమానం వచ్చిన వచ్చిన ఆమె ఆరా తీయగా ఆ నంబర్ అసలు సింగర్‌దే కాదని, నంబర్ ఇచ్చిన యువకుడు మరికొందరితో తనను మోసం చేసినట్లు గుర్తించింది. దీనిపై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By August 12, 2020 at 09:26AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabd-woman-loses-2-crores-to-contact-with-famous-telugu-singer/articleshow/77497053.cms

No comments