Rgv: థ్రిల్లర్ ఫస్ట్‌లుక్.. డిఫరెంట్ యాంగిల్స్‌లో హీరోయిన్.. మనోడి టార్గెట్ పెద్దదే!!
ఓ వైపు కరోనా ఉదృతి మరోవైపు ఆర్జీవీ సినిమాల ప్రవాహం.. ఎన్ని చెప్పుకున్నా ప్రెజెంట్ సిచువేషన్ మాత్రం ఇదే. సినీ ఇండస్ట్రీ మొత్తం లాక్‌డౌన్ కారణంగా విలవిల్లాడిపోతున్న సమయంలో పోర్న్ భామ మియా మాల్కోవాతో 'క్లైమాక్స్' సినిమా అనౌన్స్ చేసి సంచలనాలకు తెరలేపారు వర్మ. సినిమా విడుదల చేయడానికి థియేటర్స్ రీ ఓపెన్ అయ్యే దాకా వేచి చూడాల్సిన అవసరం లేదని నిరూపిస్తూ వరుస సినిమాలతో హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా అడల్ట్, పొలిటికల్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆన్‌లైన్ వేదికలను ఫుల్లుగా వాడేస్తూ ట్రెండ్ క్యాచ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ''నగ్నం, పవర్ స్టార్'' సినిమాలతో రచ్చ రచ్చ చేసి లాభాలు గడించిన వర్మ.. తాజాగా తన కొత్త సినిమా ‘’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ థిల్లర్ మూవీలో నటిస్తున్న , రాక్ ఇద్దరినీ పరిచయం చేస్తూ వారి వారి న్యూడ్ ఫొటోలతో ప్రేక్షకుల దృష్టిని లాగేసిన ఆర్జీవీ.. తాజాగా ఫస్ట్‌లుక్ పోస్టర్ ద్వారా సినిమాపై హైప్ తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ పోస్టర్‌లో హీరోయిన్ అప్సరా రాణిని భయపడుతూ రోడ్ మీద ఫోన్ మాట్లాడుతున్నట్లుగా మూడు యాంగిల్స్‌లో చూపించి ఈ మూవీలో కావాల్సినంత థ్రిల్ ఉంటుందని చెప్పేశారు. Also Read: NNN సిరీస్‌లో భాగంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన .. ఈ మూవీ కోసం పెద్ద స్కెచ్చే వేశారు. ఏకంగా ఈ చిత్రాన్ని 9 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లుగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో కన్ఫర్మ్ చేశారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, భోజపురి, గుజరాతీ, ఒడియా భాషల్లో థ్రిల్లర్ మూవీ రిలీజ్ కానుందని పేర్కొన్నారు. ఇక ఈ చిత్రాన్ని ఎప్పటిలాగే తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్, శ్రేయాస్ ఈటీలో అతిత్వరలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు వర్మ. Also Read:
By July 26, 2020 at 07:29AM
No comments