Ram Gopal Varma: పవర్ స్టార్ టైటిల్ మధ్యలో గాజు గ్లాసు.. అఫీషియల్ పోస్టర్‌తో షాకిచ్చిన వర్మ!
ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే .. '' పేరుతో సినిమా ప్రకటించినప్పుడే ఈ సారి భారీ సంచలనానికి గురిపెట్టారని స్పష్టంగా అర్థమైంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ టైటిల్ లుక్ రిలీజ్ చేసిన ఆయన గట్టి షాకిచ్చారు. ఈ లుక్ చూస్తుంటే ఈ సినిమాను భారీ ఎత్తున వివాదాలు చుట్టుముట్టడం ఖాయం అని తెలుస్తోంది. తన సినిమా పేరు 'పవర్ స్టార్' అనేది మాత్రమే చూసి తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, తాను పవన్ కళ్యాణ్ బయోపిక్ తీయడం లేదంటూ స్పష్టం చేసిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా విడుదల చేసిన 'పవర్ స్టార్' టైటిల్ మధ్యలో గాజు గ్లాసు పెట్టి సంచలనానికి తొలి అడుగేశారు. అంతేకాదు ఇందులో నటిస్తున్న యాక్టర్‌ని హాఫ్ లుక్‌లో చూపిస్తూ పలు అనుమానాలకు తెరలేపారు. ఇక ఈ లుక్ పోస్ట్ చేస్తూ ''ఇందులో ఉన్న వ్యక్తి ఎవరినైనా పోలి ఉంటే యాదృచ్చికం మాత్రమే'' తన రెగ్యులర్ డైలాగ్ వాడేశారు వర్మ. Also Read: ఇకపోతే ఇదే పోస్ట్ ద్వారా 'పవర్ స్టార్' ఫస్ట్‌లుక్ విడుదల ముహుర్తాన్ని కూడా ప్రకటించేశారు రామ్ గోపాల్ వర్మ. దానికి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ రోజు (జులై 9) ఉదయం 11 గంటల 37 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. చూడాలి మరి టైటిల్ లుక్కే ఇలా డిజైన్ చేశారంటే.. ఫస్ట్‌లుక్ ఇంకెలా చూపించబోతారనేది!.
By July 09, 2020 at 08:57AM
No comments