Breaking News

టాలీవుడ్‌లో మరో విషాదం... కరోనాతో యువ హీరో తండ్రి మృతి


టాలీవుడ్, టీవీ ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా నటుడు శ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి మంగం వెంకట దుర్గా రాంప్రసాద్‌ కరోనా వైరస్‌ బారిన పడి మృతి చెందారు. గత 20 రోజులుగా కరోనాతో బాధపడుతూ ఆయన విజయవాడలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆయన బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రముఖ డైరెక్టర్‌ మారుతి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ రోజుల్లో సినిమాతో శ్రీ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతడు లవ్‌ సైకిల్‌ సినిమాలో నటించాడు. మరోవైపు సినీ పరిశ్రమలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు కరోనాతో మరణించారు. అదే విధంగా పలువురు టీవీ నటులు కూడా కరోనా బారిన పడ్డారు. టీవీ నటులు రవికృష్ణ, రాజశేఖర్, సాక్షి శివ, రవికృష్ణ, సీరియల్‌ నటి నవ్య స్వామికి కరోనా సోకిన విషయం తెలిసిందే.


By July 09, 2020 at 09:03AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ee-rojullo-telugu-movie-actor-sris-father-passes-away-due-to-coronavirus/articleshow/76865904.cms

No comments