Breaking News

Radhe Shyam: రికార్డుల వేట ప్రారంభించిన ప్రభాస్.. ఇంతలోనే 'రాధే శ్యామ్' ఫస్ట్‌లుక్!!


యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. 'బాహుబలి' సిరీస్‌తో ఏ ఒక్కరికీ అందనంత ఎత్తులో ఉండి రికారుల సునామీ సృష్టించిన ఆయన.. ఆ తర్వాత 'సాహూ' సినిమా పరంగా కూడా పలు రికార్డులు నెలకొల్పారు. ఇక ఇప్పుడు తన 20వ సినిమా '' విషయంలో కూడా ఆరంభం నుంచే రికార్డుల వేట మొదలుపెట్టారు ప్రభాస్. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీ ఫస్ట్‌లుక్ శుక్రవారం రోజు రిలీజ్ చేశారు. దీంతో ఈ లుక్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న రెబల్ స్టార్ అభిమానలోకం వెంటనే వైరల్ చేసేశారు. ట్విట్టర్ మొత్తాన్ని 'రాధే శ్యామ్' అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి మోత మోగించారు. దీంతో ఈ ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. Also Read: ట్విట్టర్‌ వాల్‌పై సింగిల్ హ్యాప్‌ట్యాగ్‌తో 'రాధే శ్యామ్' ఫస్ట్‌లుక్ 3.8 మిలియన్లకు పైగా ట్వీట్స్ సాధించి సింగిల్ హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్ని ట్వీట్స్ సాధించిన ఫస్ట్‌లుక్‌గా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రయూనిట్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది. మరోవైపు 'రాధే శ్యామ్' ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ప్రభాస్- పూజా హెగ్డే బార్బిడాల్ డ్యాన్స్ మూమెంట్‌తో ల‌వ్‌లీగా రొమాంటిక్ స్టిల్ చూసి మురిసిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో రూపొందుతున్న ఈ 'రాధే శ్యామ్' చిత్రాన్ని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి ప్రేమకథతో ప్యాన్ ఇండియా మూవీ రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.


By July 11, 2020 at 08:19AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-latest-movie-radhe-shyam-first-look-creates-new-record/articleshow/76903626.cms

No comments