Breaking News

సీఎం జగన్‌పై సీనియర్ నటుడు కోట ఆసక్తికర వ్యాఖ్యలు


టాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ నేత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజా పరిస్థితులపై స్పందించారు. అలాగే తన పొలిటికల్ కెరీర్‌పై మాట్లాడుతూ గతంలో తాను బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాను వాజ్‌పేయ్‌కు అభిమానినని.. అందుకే తనను బీజేపీలోకి తీసుకెళ్లారన్నారు. తాను విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను అన్నారు. తాను తెలంగాణ గురించి పెద్దగా మాట్లాడనని.. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాను అన్నారు. తనకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హత ఉందని.. అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశానని.. సొంత ఊరు విజయవాడ పక్కనే ఉన్న కంకిపాడు.. అక్కడ ఆస్తి అది అన్నారు. అందుకే ఏపీ రాజకీయాలపై మాట్లాడతాను అన్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి గురించి ఒకే ఒక మాటలో చెప్తాను అన్నారు. తాను పాత సామెతలు బాగా నమ్ముతానని.. ఆ సామెత ప్రకారం ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితి చూస్తే.. నిద్రపోయే వాడిని లేపొచ్చు.. నిద్ర నటించే వాడిని లేపలెం కదా అన్నారు. అవన్నీ ఆయనకు (సీఎంకు) తెలియక జరుగుతున్నాయా.. మరి ఎందుకు అలా జరుగుతుందో తెలియడం లేదన్నారు. అంతకు మించి తాను ఏమీ చెప్పలేను అన్నారు. కోట చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.


By July 11, 2020 at 08:16AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/senior-actor-kota-srinivasa-rao-interesting-comments-on-ap-politics-and-cm-ys-jagan/articleshow/76903630.cms

No comments