Prabhas 21: ప్రభాస్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో యంగ్ రెబల్ స్టార్ రొమాన్స్
అభిమానులు పండగ చేసుకునే అప్డేట్ వచ్చింది. యంగ్ రెబల్ స్టార్‌కి సంబంధించి బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నామంటూ ముందుగానే ప్రకటించిన వైజయంతీ మూవీస్.. తాజాగా ఆ సర్‌ప్రైజ్ ప్రేక్షకుల ముందుంచింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రూపొందనున్న సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం తెలుపుతూ అందరిలోనూ ఆసక్తి నింపారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాగం కాబోతోందని చెప్పి ప్రభాస్ అభిమానులను హూషారెత్తించారు మేకర్స్. ఈ సందర్భంగా ''కింగ్ పక్కన సరిపోయే క్వీన్ కావాలి కదా..చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. పిచ్చెక్కించేద్దాం'' అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. ప్రభాస్ కెరీర్‌లో 21వ సినిమాగా రాబోతున్న ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. అతి త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తేవాలని ప్లాన్ చేస్తున్నారు. స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ మూవీ సాంకేతిక బృందం, ఇతర నటీనటుల వివరాలు అతి త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్. ప్రస్తుతం ప్రభాస్.. తన 20వ సినిమా రాధేశ్యామ్ చేస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు అప్‌డేట్ కూడా టాలీవుడ్ ప్రేక్షకుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
By July 19, 2020 at 11:46AM
No comments