పైలట్‌కు ఝలక్ ఇచ్చేందుకు గెహ్లాట్ స్కెచ్.. గవర్నర్‌తో కీలక భేటీ
ఊహించని మలుపుతో థ్రిల్లర్ సినిమాను తలపిస్తోన్న రాజస్థాన్ రాజకీయాలు దేశం దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నాయి. తాజాగా, మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసమ్మతి నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో మైనార్టీలో పడిన .. శనివారం సాయంత్రం గవర్నర్‌కు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాతో దాదాపు 45 నిమిషాలపాటు సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి, బలనిరూపించుకోడానికి అవకాశం ఇవ్వాలని గెహ్లాట్ కోరారు. బుధవారం నాడు అసెంబ్లీని సమావేశపరచాలని గెహ్లాట్ ప్రతిపాదించినట్టు తెలిసింది. అయితే, మద్దతుదారుల సంఖ్యపై గవర్నర్‌కు వివరాలను అందజేయలేదు, కానీ బలనిరూపణలో విజయం సాధిస్తామని ధీమాతో సీఎం ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే, శాసనసభను సమావేశపరిస్తే పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేల బృందంపై కఠినమైన చర్యలకు మార్గం సుగమం అవుతుందని గెహ్లాట్ భావిస్తున్నట్టు సమాచారం. వ్యూహాత్మకంగా పైలట్‌కు చెక్ పెట్టేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు గెహ్లాట్ అందజేసినట్టు శాసనసభ వ్యవహారాల మంత్రి శాంతి ధారివాల్ ధ్రువీకరించారు. 200 మంది సభ్యులున్న అసెంబ్లీలో మ్యాజిక్ సంఖ్య 101 కంటే ఎక్కువగా ఉందని.. కాంగ్రెస్‌లో 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 19 మంది పైలట్ వర్గానికి చెందినవారని వ్యాఖ్యానించారు. సీఎం గవర్నర్‌ను కలవడం అంటే అసెంబ్లీ సమావేశానికి అని కాదని అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు అవిశ్వాస తీర్మానం నెగ్గితే మరొ ఆరు నెలలు వరకు ప్రభుత్వానికి ఢోకా ఉండదు. ఇక, ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో పీసీసీ చీఫ్, డిప్యూటీ ముఖ్యమంత్రి పదవుల నుంచి ఆయనను తొలగించిన విషయం తెలిసిందే. గెహలోట్ ప్రభుత్వం సభలో బలం నిరూపించుకోడానికి ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తోందని, ఎందుకంటే తీర్మానం నెగ్గడం వల్ల అసెంబ్లీ సమావేశంలో లేనప్పుడు విప్ వర్తించదన్న అసమ్మతి ఎమ్మెల్యేలు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
By July 19, 2020 at 12:12PM
No comments