Breaking News

నేను మా దేశం పోను.. ఇక్కడే ఉంటా: కేరళ హైకోర్టును ఆశ్రయించిన అమెరికా వృద్ధుడు


పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చిన ఓ .. తాను తిరిగి స్వదేశానికి వెళ్లనని, ఇక్కడే ఉంటానని అంటున్నాడు. అంతేకాదు, తన పర్యాటక వీసాను బిజినెస్ వీసాగా మార్చాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. అమెరికా వెళ్లడానికి అవకాశం రావాలేగానీ.. రెక్కలు కట్టుకుని వాలిపోవడానికి ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అలాంటిది అమెరికాకు చెందిన 74 ఏళ్ల వృద్ధుడు స్వదేశానికి వెళ్లను గాక వెళ్లనంటున్నాడు. కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అనే వ్యక్తి.. కరోనాను నియంత్రించడంలో అమెరికా విఫలమైందని భారత్‌ విజయవంతమైందని పేర్కొన్నారు. తాను ఇక్కడే ఉంటానని, తన పర్యాటక వీసాలను బిజినెస్‌ వీసాగా మార్చాలని కోరాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చిన పీర్స్‌.. ఐదు నెలలుగా కేరళలో ఉంటున్నారు. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అమెరికా విఫలమైందని, కరోనాను భారత్‌ అద్భుతంగా నియంత్రించిందన్నారు. ప్రస్తుతం స్వదేశానికి వెళ్లడానికి తనకు ఇష్టంలేదని, తన వీసాను బిజినెస్‌ వీసాగా మార్చాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘భారత్‌లో వైరస్‌ నియంత్రణ తీరు నన్ను ఆకట్టుకుంది. అమెరికాలోని ప్రజలు కొవిడ్‌-19ను లెక్కచేయడం లేదు. అందుకే నా కుటుంబం సైతం ఇక్కడి వస్తే బాగుండనిపిస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘వ్యాపార నమూనాను చూపించి, ఐదేళ్ల బిజినెస్ వీసా పొందాలన్నది నా ఆకాంక్ష.. భారత్‌కు చెందిన వారిని వివాహం చేసుకుంటే ఇక్కడ నివాసానికి సులభమైన మార్గం.. కానీ నా వయసు ఇప్పుడు 74 ఏళ్లు కాబట్టి అది అసాధ్యం’ అన్నారు. కాబట్టి కేరళలోనే కొన్నాళ్లు ఉండి పర్యాటక సంస్థను ప్రారంభించాలని పీర్స్‌ భావిస్తున్నారు. ఫిబ్రవరి 26న భారత్‌కు వచ్చిన పీర్స్ పర్యాటక వీసా గడువు 2025 వరకు ఉంది. అయితే, వీసా నిబంధనల ప్రకారం పర్యాటకం కోసం వచ్చి 180 రోజులకు మించి ఉండకూడదు. ఇప్పటికే పీర్స్ ఐదుసార్లు భారత్‌కు వచ్చివెళ్లారు. ఆగస్టు 24తో వీసా గడువు ముగియనుండగా.. పర్యాటక వీసా కాదని, బిజినెస్ వీసా కోసం కోర్టును ఆశ్రయించడం విశేషం. ప్రస్తుతం అమెరికాలో వైరస్ విలయతాండవం చేస్తోందని, ఈ పరిస్థితుల్లో అక్కడకు వెళ్లడం ప్రమాదమన్నారు. ఇక్కడే తనకు అనుకూలంగా ఉందని, రోజూ యోగా, ధ్యానంతో ప్రశాంతంగా గడిచిపోతుందన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఎనిమిది లక్షలకు పైగా కొవిడ్‌-19 కేసులు ఉండగా అమెరికాలో 33లక్షలు దాటేశాయి. మరణాల సంఖ్య సైతం 1,37,000 దాటేసింది.


By July 12, 2020 at 09:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/managing-coronavirus-us-citizen-move-high-court-to-stay-on-in-kerala/articleshow/76917788.cms

No comments