Breaking News

అమితాబ్ బచ్చన్‌కి కరోనా.. ఉలిక్కిపడ్డ సినీ లోకం.. చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున రియాక్షన్


దేశవిదేశాల్లో విజృంభణ కొనసాగిస్తున్న కరోనా మహమ్మారి బచ్చన్ ఫ్యామిలీని తాకింది. అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయం తెలిసి యావత్ సినీ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. టాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వారిరువురూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అమితాబ్‌, అభిషేక్‌‌లకు కరోనా అని కన్ఫర్మ్ అయిన వెంటనే మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''అమిత్ జీ మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. మీరు త్వరగా తిరిగి రావాలని ఆ భగవంతుడిని వేడుకొంటున్నాం'' అని పేర్కొన్నారు. అలాగే మరో టాలీవుడ్ సీనియర్ హీరో స్పందిస్తూ.. ''డియర్ అమితాబ్ జీ.. మీరు త్వరగా కోలుకోవాలని ఆకాక్షిస్తున్నాం. ఆరోగ్యంతో క్షేమంగా తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం'' అని ట్వీట్ చేశారు. మహేష్ బాబు రియాక్ట్ అవుతూ ''మీరు త్వరగా కోలుకోవాలి సార్. మీరు క్షేమంగా త్వరగా తిరిగి రావాలని కోరుకొంటున్నాం'' అని పేర్కొన్నారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. ''అమితాబ్, అభిషేక్.. మీరిద్దరూ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. మీరు ధైర్యంగా ఉంటారని ఆశిశ్తున్నా'' అని పేర్కొంది. ఇంకా సోనుసూద్, లారాదత్తా, తాప్సీ, నేహా దూపియా, దర్శకుడు గుణశేఖర్ తదితరులు ట్వీట్స్ చేస్తూ అమితాబ్, అభిషేక్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ ఇద్దరూ ముంబై లోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వాళ్ళిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెబుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశం.


By July 12, 2020 at 10:18AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chiranjeevi-nagarjuna-and-other-celebrities-reaction-on-amitabh-bachchan-corona-possitive/articleshow/76918390.cms

No comments