ప్రేమ పెళ్లి చేసుకుందన్న కక్షతో కూతురిపై దాడి.. తిరిగి ఆమెపైనే ఫిర్యాదు
తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురిపై తల్లిదండ్రులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన ఘటన జిల్లా బోథ్ మండలం కౌట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కాంతారావు, పద్మినిబాయిల పెద్ద కూతురు మంజూషకు గత మే నెలలో మేనబావతో పెళ్లి నిశ్చయించారు. అప్పటికే రాజు అనే వ్యక్తిని ప్రేమించిన మంజూష ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. కూతురి వ్యవహారంతో పరువు పోయిందని భావించి కాంతారావు కుటుంబం గ్రామాన్ని వదిలి మహారాష్ట్రలోని తమ బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. Also Read: కొద్దిరోజుల క్రితం గ్రామానికి తిరిగొచ్చిన కాంతారావు దంపతులు మంజూషను ఇంటికి ఆహ్వానించారు. దీంతో శనివారం ఆమె పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులతో సరదాగా గడిపిన ఆమె మాటల మధ్యలో తన పెళ్లి కోసం కొన్న వస్తువులు, కట్నం డబ్బులు తనికివ్వాలని అడిగింది. అప్పటికే కూతురు ప్రేమ వివాహం చేసుకుని పరువు తీసిందన్న కోపంతో ఉన్న తల్లిదండ్రులు ఆమెతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన మంజూషను భర్త రాజు వెంటనే భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించాడు. Also Read: మరోవైపు ఈ ఘటనపై మంజూషపైనే తల్లిదండ్రులు ఎదురు ఫిర్యాదు చేశారు. మంజూష ఇంటికి వచ్చి తమపై దాడికి పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు మాత్రం ప్రేమ వివాహం చేసుకున్నందుకే తల్లిదండ్రులు తనపై దాడిచేశారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 12, 2020 at 09:05AM
No comments