రాత్రి నిద్రపోయిన కూతురి తెల్లారేసరికి మిస్సింగ్.. షాకైన తల్లిదండ్రులు
నగరంలో మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. కుటుంబ కలహాలతోనో, ఇతర సమస్యలతోనో చాలామంది ఇళ్ల నుంచి వెళ్లిపోయి తిరిగి రావడం లేదు. ఇలాంటి కేసులు పోలీసులకు కూడా తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా బాలానగర్‌కు చెందిన 15 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రులతో కలిసి శనివారం రాత్రి భోజనం చేసి నిద్రపోయిన బాలిక తెల్లారేసరికి కనిపించకుండా పోయింది. Also Read: బీహార్‌కు చెందిన రామ్‌బిలాస్ సహాని, సరితాదేవి దంపతులు 18 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. ప్రస్తుతం బాలానగర్ గౌతమీ నగర్ సమీపంలోని నాగార్జున నగర్ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరి పెద్ద కుమార్తె కాజల్ కుమారి(15) స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి నిద్రపోయింది. Also Read: ఆదివారం ఉదయం తల్లిదండ్రులు నిద్రలేచి చూడగా కాజల్ కుమారి కనిపించలేదు. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో తల్లి సరితాదేవి బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు కేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమెను ఎవరైనా ఎత్తుకెళ్లారా? లేక ప్రేమ వ్యవహారమేదైనా ఉందా? అన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. Also Read:
By July 13, 2020 at 09:46AM
No comments