Breaking News

ముగ్గురు పిల్లలతో సహా మహిళ మిస్సింగ్.. మియాపూర్‌ పోలీసుల గాలింపు


ఓ వివాహిత తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన హైదరాబాద్ మియాపూర్‌ పోలీస్‌స్టేషన్లో జరిగింది. కాలేమ్‌ హుస్సేన్, కాలేమ్‌ జయ దంపతులు నివాసముంటున్నారు. వీరికి కూతురు స్వప్న(11), కుమారులు శిరీష(7), ఇషాన్‌(8) సంతానం. భార్యభర్తలిద్దరూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ముగ్గురు పిల్లలతో కలిసి బయటకు వెళ్లిన జయ తిరిగిరాలేదు. రాత్రయినా భార్య, పిల్లల రాకపోవడంతో ఆందోళనపడిన హుస్సేన్ బంధువుల ఇళ్లల్లో వాకబు చేశాడు. Also Read: చుట్టుపక్కల ప్రాంతాలో కూడా వారి ఆచూకీ లభించకపోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆమె కుటుంబ కలహాలతో ఇలా చేసిందా? లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By July 28, 2020 at 09:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-eloped-with-3-chidrens-in-miyapur-hyderabad/articleshow/77212376.cms

No comments