మూడేళ్ల కొడుకుని చంపి తల్లి ఆత్మహత్య.. హైదరాబాద్‌లో దారుణం
హైదరాబాద్‌లోని ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ మూడేళ్ల కొడుకును చంపేసి తానూ ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వర్కట్ పల్లికి చెంది గుళ్లం మమత.. భర్త, కొడుకు రియాన్ష్(3)తో కలిసి ఎల్బీనగర్‌లోని శాతవాహన నగర్‌లో నివాసముంటోంది. దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి మమత తన కొడుకు కుడిచేతిని కత్తితో కోసింది. తీవ్ర రక్తస్రావంతో బాలుడు కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. Also Read: అనంతరం మమత తాము ఉంటున్న అపార్ట్‌మెంట్ మూడో అంతస్తు నుంచి కిందికి దూకేసింది. ఈ ఘటనను కళ్లారా చూసిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే చనిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మమత, రియాన్ష్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By July 28, 2020 at 09:58AM
No comments