Breaking News

ప్రముఖ నటుడు కిక్ శ్యామ్ అరెస్ట్


ప్రముఖ సినీ నటుడు కిక్ సినిమా ఫేమ్ అయిన శ్యామ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతున్న శ్యామ్ గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా పేకాట, బెట్టింగులు నిర్వహిస్తుండటంతో కేసు నమోదు చేశారు. తెలుగు, తమళ సినిమాల్లో నటించిన శ్యామ్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కిక్, ఊసరవెల్లి ,రేసుగుర్రం, కిక్- 2 వంటి చిత్రాలలో నటించాడు శ్యామ్. ఎక్కువగా దర్శకుడు సురేంద్ర రెడ్డి సినిమాల్లో కనిపించాడు. కిక్ సినిమాలో అతడు మంచి పాత్ర వేయడంతో తెలుగు జనాల్లో గా గుర్తింపు తెచ్చుకున్నాడు. Read More: తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూ శామ్ బిజిగా మారాడు. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. 2001 నుంచి అతడు పలు సినిమాల్లో నటించాడు. అయితే 2009లో వచ్చిన కిక్ సినిమా అతడి కెరిర్‌ను మలుపు తిప్పింది. అతడి పేరు కూడా అప్పట్నుంచి కిక్ శామ్‌గా మారింది. శామ్ పూర్తి పూరే మొహమ్మద్ షమ్‌షుద్దీన్ ఇబ్రహీం. భార్యా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.


By July 28, 2020 at 09:57AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-shyam-arrested-by-chennai-police-for-gambling/articleshow/77212639.cms

No comments