సైకోలా మారిన ప్రియుడు.. వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
ప్రియుడి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో విషాదం నింపింది. సారంగాపూర్ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన కొత్తపల్లి ఉమ(19) రెండేళ్ల కిందట సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివింది. ఈ క్రమంలోనే తన క్లాస్‌మేట్ అదే గ్రామానికి చెందిన మడ్డి రంజిత్(19)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇంటర్ తర్వాత చదువు మానేసిన ఉమ ఇంట్లోనే ఉంటూ బీడీలు చుడుతోంది. అయితే ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, నువ్వు వెంటనే పెళ్లి చేసుకోకపోతే తల్లిదండ్రులు వేరొకరితో వివాహం చేసేస్తారని ప్రియుడితో చెప్పింది. Also Read: అయితే పెళ్లి చేసుకుంటే తనను మాత్రమే చేసుకోవాలని, వేరొకరిని చేసుకుంటే ఊరుకునేది లేదని రంజిత్ ఆమెకు తేల్చి చెప్పాడు. దీంతో తనను వెంటనే పెళ్లి చేసుకోమని ఉమ కోరగా నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదని చెప్పాడు. అసలు ప్రియుడు పెళ్లిచేసుకుంటాడా? చేసుకోడా? అంటూ తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు రంజిత్‌తో మాట్లాడినా ఫలితం లేకపోయింది. వారు కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తుండగా రంజిత్ వాటిని చెడగొడుతున్నాడు. దీంతో ఆవేదనకు గురైన ఆమె సోమవారం ఇంట్లోనే గడ్డిమందు తినేసింది. తల్లిదండ్రులు ఆమెను వెంటనే జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. Also Read: పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా రెండ్రోజుల పాటు చికిత్స పొంది బుధవారం మృతిచెందింది. ఈ క్రమంలోనే ఉమ రాసిన సూసైడ్ నోట్ ఆమె అక్కకు దొరికింది. ‘ అమ్మా నాన్నా నన్ను క్షమించండి. రంజిత్ నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడు.. నిన్ను పెళ్లి చేసుకుంటే నేనే చేసుకోవాలి లేదంటే నువ్వు చచ్చిపోవాలి అని అంటూ బెదిరిస్తూ మానసికంగా నాకు నరకం చూపుతున్నాడు.. నేను వాడిని పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండను. నాకు వచ్చే పెళ్లి సంబంధాలు కూడా చెడగొట్టేస్తున్నాడు. నేను బతికి మీకు బాధను ఇవ్వడం తప్ప నా నుంచి మీకు జరిగే మంచి ఏమీ లేదు.. అందుకే మిమ్మల్ని వదిలిపోతున్నా... గుడ్‌బై ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్.. మిస్‌యూ మై ఫ్యావిులీ.. మిస్ మై మామ్.. డాడ్..’ అంటూ ఉమ లేఖలో రాసింది. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు రంజిత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 23, 2020 at 08:59AM
No comments