Breaking News

మాంత్రికుడితో రాసలీలలు, కన్నబిడ్డకు చిత్రహింసలు.. తల్లికి షాకిచ్చిన కోర్టు


అక్రమ సంబంధాన్ని దాచిపెట్టేందుకు ఓ మహిళ ప్రియుడితో కలిసి కన్నకొడుకునే చిత్రహింసలకు గురిచేసింది. ఈ ఘటనపై కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2016, సెప్టెంబర్‌లో కేసు నమోదైంది. దీన్ని విచారించిన న్యాయస్థానం నిందితులకు బుధవారం జైలుశిక్షలు ఖరారు చేసింది. మోతీనగర్‌లోని బబ్బుగూడకి చెందిన ఫర్హానా బేగం(36)కు బుద్ధిమాందల్యంతో బాధపడుతున్న కొడుకున్నాడు. అతడికి బూతవైద్యం చేయించేందుకు హఫిజ్‌బాబానగర్‌ ప్రాంతానికి చెందిన మంత్రగాడు ఫయాజ్‌ మహమ్మద్‌ అన్సారీ(38) వద్దకు తీసుకొచ్చింది. Also Read: ఈ క్రమంలోనే మంత్రగాడితో ఫర్హానాకు సాన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. వారిద్దరూ తరుచూ హఫిజ్‌బాబానగర్‌లోని బబ్బుగూడలోని ఓ ఇంట్లో శారీరకంగా కలిసేవారు. తనకు చికిత్స కోసం తీసుకొచ్చి మంత్రగాడితో గదిలోకి వెళ్లి ఏం చేస్తున్నావని కొడుకును పర్హానాను నిలదీశాడు. దీంతో ఇద్దరు కలిసి బాలుడిని శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు. తమ సుఖానికి అడ్డుపడుతున్నాడని బాలుడిని హతమార్చేందుకు కూడా ప్రయత్నించారు. Also Read: చికిత్స చేయిస్తున్నా కూడా దిగులుగా, భయంగా ఉంటున్న కుమారుడిని గమనించిన తండ్రి ఏం జరిగిందని ఆరా తీయగా తల్లి నిర్వాకం గురించి చెప్పాడు. దీంతో బాలుడి తండ్రి 2016 సెప్టెంబరు 26న కంచన్‌బాగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. కోర్టు ప్రాంగణంలోని అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి సునీత కుంచల బుధవారం ఈ కేసు తుది విచారణ చేపట్టారు. ఇద్దరిని దోషులుగా నిర్ధారించి.. మాంత్రికుడికి జీవితఖైదుతో పాటు రూ.10 వేలు జరిమానా, తల్లికి పదేళ్లు జైలుతో పాటు రూ.20 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఇద్దరూ కలిసి బాలుడికి రూ.60 వేలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. Also Read:


By July 23, 2020 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-and-her-lover-gets-10-year-jail-for-torture-minor-boy-in-hyderabad/articleshow/77119618.cms

No comments